నటి త్రిష తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఆశయాన్ని బయటపెట్టింది. ఎప్పటికైనా తన సొంత రాష్ట్రం తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేయాలనేది తన గాఢమైన కోరిక అని, “ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం. సామాజిక మార్పులు రాజకీయాల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయని నమ్ముతున్నా” అని త్రిష పేర్కొంది.
త్రిష వ్యాఖ్యలు తమిళ సినీ మరియు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ప్రజల మద్దతు పొందేందుకు ఇది కేవలం ప్రచారం మాత్రమేనా, లేక నిజంగా ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడతుందా అన్న దానిపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ రాజకీయాల్లో ఇప్పటికే సినీ తారల ప్రభావం గణనీయంగా ఉంది. త్రిష ఈ రంగంలోకి వస్తే, ఆమెకు ఎంతమేరకు విజయావకాశాలు ఉంటాయో చూడాలి.
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష ఈ వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల వయస్సులోనూ హీరోయిన్‌గా చెలామణి అవుతున్న త్రిష.. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాట థళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టి, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.