నటికి బెదిరింపులు.. మలయాళ దర్శకుడిపై కేసు నమోదు!

నటికి బెదిరింపులు.. మలయాళ దర్శకుడిపై కేసు నమోదు!

మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపిన ఘటనలో ప్రముఖ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌పై పోలీసుల కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి నటి ఒక‌రు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, దర్శకుడు సోషల్ మీడియా ద్వారా తనను వేధించడమే కాకుండా, బెదిరింపులకు పాల్పడిన‌ట్లు పోలీసుల‌కు అందించిన‌ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు.

‘కాయం’ దర్శకుడిపై వివిధ ఆరోపణలు
అడ్వెంచరస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సనల్ కుమార్ శశిధరన్, కాయం సినిమాతో ఫేమ‌స్ అయ్యారు. ప్రస్తుతం ఆయ‌న‌ అమెరికాలో ఉన్నప్పటికీ, ఫేస్‌బుక్ ద్వారా త‌న‌ను బెదిరించార‌ని నటి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలమక్కార పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా, వేధింపు, నేరపూరిత బెదిరింపు, పరువు నష్టం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత నటి పేరు పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే ఈ కేసు పట్ల సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment