ప్రముఖ నటి తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగర వైరల్ అవుతున్నాయి. “నాకు కొందరు పెద్ద స్టార్లకు మెసేజ్ పెట్టడం నేర్చుకోమని సలహా ఇచ్చారు. ఎందుకని అడిగితే, దానివల్ల స్టార్ నైట్స్‌కి, బర్త్‌డే పార్టీలకు వెళ్ళి, తక్కువ సమయంలో పెద్ద స్టార్‌గా ఎదగవచ్చని చెప్పారు. కానీ, నాకు అలాంటివి చేయడంలో ఆసక్తి లేదని వారికి స్పష్టంగా చెప్పాను” అంటూ తాప్సీ వెల్లడించింది.
ఈ వ్యాఖ్యలు తాప్సీ తన సొంత పంథాను అనుసరిస్తుందన్న విషయాన్ని మరోసారి హైలైట్ చేశాయి. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడమే లక్ష్యం అని ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. నటి తాప్సీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.