హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్: సోషల్ మీడియాలో వైరల్!

హీరోను చెప్పుతో కొట్టిన హీరోయిన్: సోషల్ మీడియాలో వైరల్!

ముంబై (Mumbai)లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ హీరోయిన్ (Heroine) అందరి ముందే హీరో (Hero), ప్రొడ్యూసర్‌ (Producer)ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏం జరిగింది?
బాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో అయిన మాన్ సింగ్‌ (Maan Singh)ను, హీరోయిన్ రుచి గుజ్జర్ (Ruchi Gujjar) చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ (So Long Valley) అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన జులై 25న ముంబైలోని సినీపోలిస్ థియేటర్‌కు వచ్చారు. మాన్ సింగ్ వస్తున్న విషయం ముందే తెలుసుకున్న రుచి గుజ్జర్ అక్కడికి చేరుకుని, ఆయనను చెప్పుతో కొట్టింది. దాడిని ఆపేందుకు పక్కనే ఉన్న అతని సహాయకులు అడ్డుపడి, గుజ్జర్‌ను పక్కకు తీసుకెళ్లారు.

దాడికి కారణం ఇదే!
తనకు మాన్ సింగ్ రూ. 25 లక్షలు బాకీ ఉన్నాడని, అందుకే దాడి చేసినట్టు రుచి గుజ్జర్ తెలిపింది. ఆ డబ్బులు ఇవ్వమంటే దాటవేస్తున్నాడని ఆమె ఆరోపించింది. ఈ డబ్బుల విషయంపై గుజ్జర్ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మ్యూజిక్ ఆల్బమ్స్‌కు సంబంధించిన తన రెమ్యునరేషన్ మాన్ సింగ్ ఇంకా ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తోంది.

రుచి గుజ్జర్ మొదట్లో మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని హిందీ సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అప్పట్లో మాన్ సింగ్ నిర్మాతగా చేసిన కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌లో ఆమె నటించింది. ఆ డబ్బుల కోసం అతని చుట్టూ ఆమె తిరుగుతూనే ఉన్నట్టు చెబుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment