పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజీ’ (‘OG’) సినిమాతో విజయంతో దూసుకుపోతున్న నటి ప్రియాంకా మోహన్ (Priyanka Mohan), సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని AI-జనరేటెడ్ (AI-Generated) (కృత్రిమ మేధస్సు సృష్టించిన) అభ్యంతరకర ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ నకిలీ చిత్రాలలో ఆమెను తప్పుగా, అసభ్యకరంగా చిత్రీకరించడంతో, ఈ ఫేక్ ఫోటోలను (Fake Pictures) షేర్ చేస్తున్న వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాలు తన పరువు తీసేలా ఉన్నాయని మండిపడ్డ ప్రియాంకా మోహన్, ఈ వ్యవహారంపై తన ఎక్స్ (X) ఖాతా ద్వారా స్పందించారు.
“నన్ను తప్పుగా చూపించడానికి ఉద్దేశించిన ఇలాంటి నకిలీ దృశ్యాలను షేర్ చేయడం తక్షణమే ఆపండి,” అని ఆమె ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. “మనం AIని కేవలం నైతిక సృజనాత్మకతకు మాత్రమే ఉపయోగించాలి తప్ప, తప్పుడు సమాచారం కోసం కాదు. మనం ఏమి పంచుకుంటాము అనే దాని గురించి అందరూ బాధ్యతగా మరియు జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు. నకిలీ చిత్రాలతో పరువు తీయాలని చూస్తున్న వారిపై ప్రియాంకా మోహన్ ఘాటుగా రియాక్షన్ ఇవ్వడంతో, ఆమె అభిమానులు మద్దతుగా నిలుస్తూ ఆ ఫేక్ ఫోటోలను నిలిపివేయాలని కోరుతున్నారు.








