తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరో అజ్మల్ అమీర్ (Ajmal Ameer) చుట్టూ అసభ్య ప్రవర్తన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ అభ్యంతరకర వీడియోపై అజ్మల్ స్పందిస్తూ, అది ఏఐ ఫేక్ వీడియో(AI Fake Video) అని, తన కెరీర్‌ను దెబ్బతీయడానికి చేసిన తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశాడు.
అయితే, తాజాగా తమిళ నటి నర్విని దేరి (Narvini Dery) మీడియా ముందుకు వచ్చి, అజ్మల్ నిజంగానే అలాంటి వ్యక్తి అని నిరూపిస్తూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఆమె తెలిపిన వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
నర్విని దేరి తన అనుభవాన్ని వివరిస్తూ, 2018లో చెన్నై(Chennai)లోని ఒక మాల్‌లో అజ్మల్‌ను కలిశానని, తర్వాతి రోజు ఆడిషన్ కోసం డెన్మార్క్‌కు వెళ్లాల్సిన తనను బలవంతంగా రప్పించాడని తెలిపింది. ఆడిషన్ కోసం వెళ్ళిన రూమ్‌లో అజ్మల్ ఒక్కడే ఉన్నాడని, అది తనకు అసహజంగా అనిపించిందని చెప్పింది. అప్పుడు అజ్మల్ తన చేయి పట్టుకొని డ్యాన్స్ చేద్దామని అడగగా, తాను స్పష్టంగా తిరస్కరించి, “మీ ఉద్దేశం నాకు అర్థమైంది, దానికోసం నేను రాలేదు” అని చెప్పానని వివరించింది.
అప్పుడు అజ్మల్, తన వెనుక ఎంతో మంది అమ్మాయిలు పడతారని గొప్పలు పోయాడని తెలిపింది. చివరికి ఒక ఫోన్ కాల్ రావడంతో తను రూమ్ నుంచి సురక్షితంగా తప్పించుకున్నానని వెల్లడించింది. అప్పుడు కెరీర్, చదువుపై దృష్టి పెట్టడం వల్ల కంప్లైంట్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఆయన నిజ స్వరూపం అందరికీ తెలియాలని నర్విని ఆవేదన వ్యక్తం చేసింది.





 



