జేసీ వ్యాఖ్య‌ల‌కు మాధ‌వీల‌త‌ స్ట్రాంగ్ కౌంట‌ర్

జేసీ వ్యాఖ్య‌ల‌కు మాధ‌వీల‌త‌ స్ట్రాంగ్ కౌంట‌ర్

టీడీపీ నేత JC ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్ప‌ద‌న వ్యాఖ్య‌ల‌కు హీరోయిన్, బీజేపీ నేత మాధవీలత తీవ్రంగా స్పందించారు. ఆ వయసు అయిపోయిన మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు.. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం అంటూ చుర‌క‌లు అంటించారు. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు. మహిళల మాన ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను అని మాధవీలత చెప్పారు. ఒంటరిగానైనా పోరాడతానన్నారు. సినిమాల్లో ఉండే వాళ్ళంతా ప్రాస్టిట్యూట్‌లా? అని మాధవీలత ప్ర‌శ్నించారు. సినిమాలలో ఉన్న వాళ్లంతా ప్రాస్టిట్యూట్లని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్పారు కాబ‌ట్టి, ఆ జిల్లా నుంచి ఎవరు ఇండస్ట్రీకి రావద్దు అంటూ మాధవీలత సూచించారు.

మహిళలు సురక్షితంగా ఉండాలని చెప్పడమే తాను చేసిన తప్పా అని ఆమె ప్రశ్నించారు. తాడిపత్రిలో ఉండే వాళ్లు మాత్రమే మహిళలా.? మిగిలిన వాళ్ళు అంత బజారు వాళ్ళ అంటూ జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. వయసులో పెద్దవారైనా ఆయన గౌరవప్రదమైన మాటలు మాట్లాడాలని, అసభ్య పదాలు వాడడం దారుణమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన భాషను బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుందని స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment