సినీ నటి కల్పిక గణేష్ (Kalpika Ganesh)పై మరో కేసు (Another Case) నమోదైంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించిందంటూ కీర్తన (Keerthana) అనే బాధితురాలు హైదరాబాద్ (Hyderabad) సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది. తన ఇన్‌బాక్స్ మెసేజ్‌లు, స్టేటస్‌గా పెట్టిన స్క్రీన్‌షాట్‌లను కీర్తన పోలీసులకు ఆధారాలుగా సమర్పించింది. ప్రజం క్లబ్ వ్యవహారంపై ఇప్పటికే కల్పికపై ఒక కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ప్రజం క్లబ్ వివాదం ఏంటి?
గత నెల 29న తన పుట్టినరోజు సందర్భంగా కల్పిక గణేష్ తన స్నేహితులకు ప్రిజం పబ్‌లో పార్టీ ఇచ్చింది. అయితే, బర్త్‌డే కేక్ విషయంలో పబ్ నిర్వాహకులకు, కల్పికకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కల్పికపై కేసు నమోదైంది.
‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘యశోద’, ‘నమో వెంకటేశా’, ‘జులాయి’, ‘సారొచ్చారు’, ‘హిట్-1’, ‘పడి పడి లేచే మనసు’ వంటి పలు సినిమాల్లో కల్పిక నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని వెబ్‌సిరీస్‌లలో కూడా ఆమె నటించారు.