బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన‌ నటి

బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన‌ నటి

దాదాపు 15 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ కన్నడ నటి రాన్యా రావ్ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టయ్యారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. డీఆర్‌ఐ (Directorate of Revenue Intelligence) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాన్యా గత 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి ప్రయాణంలోనూ ఆమె అదే దుస్తులు ధరించారు. ఇదే అధికారులు ఆమెపై నిఘా పెట్టడానికి కారణమైంది. దీంతో ఆమెను విచారించిన అధికారులు 15 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెలుగు చూడాల్సి ఉంది.

క‌ర్ణాట‌క‌లోని చిక‌మంగ‌ళూరు ప్రాంతానికి చెందిన రాన్యా రావ్ బెంగుళూరులోని ద‌యానంద్ సాగ‌ర్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఆమె ఇంజినీరింగ్ ప‌ట్టా పొందారు. 2014లో ఆమె చిత్ర రంగంలో ప్ర‌వేశించింది. మానిక్య చిత్రంలో ఆమె క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ సుదీప్‌తో క‌లిసి న‌టించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment