బర్త్‌డే గిఫ్ట్‌.. కోటి విలువైన BMW కారు

బర్త్‌డే గిఫ్ట్‌.. కోటి విలువైన BMW కారు

మలయాళ (Malayalam) నటి అహానా కృష్ణ (Ahana Krishna) తన పుట్టినరోజు సందర్భంగా తనకు తానే ఓ ఖరీదైన బహుమతిని ఇచ్చుకుంది. ఆమె ఎంతోకాలంగా ఆశించిన లగ్జరీ కారు BMW X5ని కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం.

తన 30వ వయస్సులోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కొత్త కారును ఇంటికి తీసుకొచ్చినట్లు అహానా సోషల్ మీడియాలో పంచుకుంది. సినిమా పనుల్లో బిజీగా ఉండటం వల్ల జీవితం గురించి స్పష్టత లేదని, అయితే కొత్త వయస్సుకు స్వాగతం పలుకుతున్నానని భావోద్వేగంగా రాసింది.

లగ్జరీ కారు (Luxury Car) కొనే విషయంలో తనకు సలహా ఇచ్చినందుకు హీరో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan)కు అహానా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఏ మోడల్ ఎంచుకోవాలనే విషయంలో దుల్కర్ సూచనలు ఇచ్చాడని వెల్లడించింది. అహానా కృష్ణ ప్రస్తుతం ‘పడి’, ‘నాన్సీ రాణి’ వంటి చిత్రాలలో నటిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment