ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించిన‌ భారత్

ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌రిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. 133 పరుగుల ల‌క్ష్యంతో ఈడెన్ గార్డెన్ మైదానంలోకి దిగిన భార‌త్‌.. 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అతి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోశారు. సంజూ శాంసన్ (29) ఫరవాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment