డివోర్స్ పై స్పందించిన అభిషేక్ బచ్చన్!

డివోర్స్ పై స్పందించిన అభిషేక్ బచ్చన్!

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) విడాకుల (Divorce)పై సోషల్ మీడియాలో తీవ్రమైన పుకార్లు (Rumors) షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లపై వీరిద్దరూ నేరుగా స్పందించకపోవడం, తరచుగా వేర్వేరుగా కనిపించడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. తాజాగా, అభిషేక్ బచ్చన్ ఈ విషయంపై పరోక్షంగా స్పందించారు.

“సోషల్ మీడియాలో వచ్చే వాటిని మా ఇంట్లో పెద్దగా పట్టించుకోం. కేవలం పని గురించి మాత్రమే మేము చర్చించుకుంటాం. ఖాళీగా ఉంటే అందరం కుటుంబ విషయాలను పంచుకుంటాం” అని అభిషేక్ తెలిపారు. బయటి విషయాలను తమ ఇంట్లోకి తీసుకురారని, తన తల్లి (జయ బచ్చన్), తన భార్య ఐశ్వర్య బయట ఎన్ని రకాల పుకార్లు వచ్చినా పెద్దగా పట్టించుకోరని ఆయన స్పష్టం చేశారు. “రీసెంట్‌గా ఇలాంటివి మా గురించి ఎక్కువగా వస్తున్నాయి,” అని అభిషేక్ పేర్కొన్నారు.

మా కుటుంబం సంతోషంగా ఉంది.. ప్రేమ అలాగే ఉంది!
“మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎలాంటి సమస్యలు లేవు,” అని అభిషేక్ బచ్చన్ తమ బంధం గురించి భరోసా ఇచ్చారు. ఐశ్వర్య రాయ్‌తో తన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ, “నేను ఐశ్వర్య రాయ్‌ను స్విట్జర్లాండ్‌ (Switzerland)లో 1995లో మొదటిసారి కలిశాను. అప్పుడే ఆమె నాకు ఎంతో నచ్చింది. మొదటిసారి మేము డిన్నర్‌కు వెళ్లాం. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమె వ్యక్తిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం” అని చెప్పుకొచ్చారు.

తన తండ్రి అమితాబ్ బచ్చన్ సినిమాల్లో ఐశ్వర్య నటిస్తుందని తెలిసి ఇంకా సంతోషించానని, మెల్లిమెల్లిగా ఇద్దరం ఒకరికొకరం అర్థం చేసుకున్నామని అభిషేక్ తెలిపారు. “మా ఇద్దరి మధ్య అప్పుడు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఎప్పటికీ మేమంతా కలిసే ఉంటాం” అని పుకార్లకు చెక్ పెట్టారు.

తమ కుమార్తె ఆరాధ్య గురించి మాట్లాడుతూ, “నా కూతురు ఆరాధ్య అంటే మాకు ఎంతో ఇష్టం. ఇప్పటికీ ఆమెకు ఫోన్ లేదు. ఆమె మా ఇంటి గౌరవాన్ని కాపాడుతోంది. ఆమె ఎదుగుదల పట్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎప్పటికీ ఆమె వ్యక్తిత్వానికి మేము గౌరవం ఇస్తూనే ఉంటాం,” అని అభిషేక్ బచ్చన్ తన ప్రసంగాన్ని ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment