బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par) ప్రస్తుతం యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా ఈ సినిమా పే-పర్-వ్యూ మోడల్‌లో రూ.100కి అందుబాటులో ఉంటుంది. అయితే, స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాపై ఒక బంపర్ ఆఫర్‌ను చిత్ర బృందం ప్రకటించింది.
ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు ఈ సినిమాను కేవలం రూ.50లకే చూడవచ్చని తెలిపింది. ఈ మూడు రోజులు యూట్యూబ్‌లో రూ.50 చెల్లించి సినిమాను చూసే అవకాశం కల్పించారు.
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెనీలియా కథానాయికగా నటించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ సినిమాను నిర్మించారు. ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమిర్ నటించిన ఈ సినిమా మంచి అంచనాలను అందుకొని, మంచి కలెక్షన్లు రాబట్టింది.