రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువ‌తిపై క‌త్తి, యాసిడ్‌తో దాడి

రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువ‌తిపై క‌త్తి, యాసిడ్‌తో దాడి

అన్న‌మ‌య్య జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌న్న ఆక్రోశంతో యువ‌తిపై యాసిడ్‌తో, కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ‌ ఘ‌ట‌న అన్న‌మ‌య్య జిల్లా గుర్రంకొండ మండ‌లం ప్యారంప‌ల్లిలో జ‌రిగింది. ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డిన బాధితురాలు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుంది.

ప్యారంప‌ల్లికి చెందిన యువ‌తిని మ‌ద‌న‌ప‌ల్లికి చెందిన గ‌ణేష్ అనే యువ‌కుడు గ‌త కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవ‌లే కుటుంబ స‌భ్యులు యువ‌తికి పెళ్లి నిశ్చ‌యించారు. ఈ వార్త విన్న గ‌ణేష్ సైకోలా మారిపోయాడు. త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌కుండా, మ‌రొక‌రితో పెళ్లికి సిద్ధ‌మ‌వుతోంద‌ని ప‌గ పెంచుకొని, ఆ యువ‌తిని హ‌త్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇంట్లో ఒంట‌రిగా ఉన్న యువ‌తిపై క‌త్తితో పాశ‌వికంగా దాడి చేశాడు. అనంత‌రం ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి ప‌రార‌య్యాడు. ప్రేమోన్మాది దాడిలో యువ‌తి తీవ్రంగా గాయ‌ప‌డింది. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌ని, యువ‌తిపై క‌త్తితో ఆపై యాసిడ్‌తో దాడి చేసిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. నిందితుడిని క‌ఠినంగా శిక్షించాల‌ని కుటుంబ స‌భ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment