రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

రాయ‌చోటిలో దారుణం.. బాలిక‌ను గర్భవతిని చేసి అబార్షన్ చేయించి..

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బాలిక‌పై దారుణమైన ఘటన చోటుచేసుకుంది. హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వెళ్ళే బాలికను ల్యాబ్ టెక్నీషియన్ అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఈ విష‌యం తెలిసి ఆ బాలిక‌కు అబార్ష‌న్ కూడా చేయించాడు.

ఘటన పూర్తి వివరాలు
రాయచోటి ఆసుపత్రిలో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్, హెచ్ఐవీ నివారణ మందుల కోసం ఆసుపత్రికి వచ్చే బాలికతో పరిచయం పెంచుకున్నాడు. అతడు ఆ పరిచయాన్ని అలుసుగా తీసుకొని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘాతుకం తర్వాత బాలిక గర్భవతిగా మారింది. విషయం బయట పడకుండా ఉండటానికి ఆసుపత్రిలోనే పని చేసే ఓ నర్సు సహకారంతో అబార్ష‌న్‌ చేయించాడు.

బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment