---Advertisement---

జ‌గ‌న్ పుట్టిన‌రోజు.. పార్టీ శ్రేణుల‌కు కీల‌క పిలుపు

జ‌గ‌న్ పుట్టిన‌రోజు.. పార్టీ శ్రేణుల‌కు కీల‌క పిలుపు
---Advertisement---

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును ఘ‌నంగా నిర్వ‌హించేందుకు అటు జ‌గ‌న్ అభిమానులు, పార్టీ శ్రేణులు సిద్ధం అవుతున్న నేప‌థ్యంలో పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈనెల 21న జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ శ్రేణులంతా జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌ల్లో భాగంగా అంద‌రూ సేవా కార్య‌క్ర‌మాల్లో మమేకం కావాలని కోరింది. ఎమ్మెల్యేలు, పార్టీ కో–ఆర్డినేటర్లు సమన్వయం చేసుకుని, పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భాగస్వామ్యం చేస్తూ, జగన్‌ పుట్టినరోజు వేడుకలు అన్ని స్థాయిల్లో ఘనంగా నిర్వహించాలని నిర్దేశించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment