చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం

అన‌కాప‌ల్లి జిల్లాలో ఓ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో శనివారం చోటు చేసుకుంది.

ఏటికొప్పాక గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక స్థానికంగా ఉన్న అంగ‌న్‌వాడీ కేంద్రంలో చదువుకుంటోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఎనిమిదో తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన బాలుడు ఆడుకుందాం రమ్మని మాయ‌మాట‌లు చెప్పి అతని ఇంట్లోకి తీసుకెళ్లాడు.

ఆడుకుందామ‌ని ఐదేళ్ల చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లిన బాలుడు.. ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. దీంతో బాధిత చిన్నారి ఈ విషయాన్ని తల్లితో చెప్పింది. చిన్నారి త‌ల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment