బ‌న్నీ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘పుష్ప 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

బ‌న్నీ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్.. ‘పుష్ప 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

Summarize with AI

అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ప’(Pushpa) సినిమా దేశ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. కొత్త‌ కొత్త రికార్డులను త‌న ఖాతాల్లో వేసుకుంది. 2021లో విడుదలైన ‘పుష్ప 1’ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, 2024 ఏడాది చివ‌ర్లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ‘పుష్ప 2’(Pushpa 2) సైతం ఘన విజయం సాధించింది.

ఇప్పుడు ఫ్యాన్స్ అందరి మదిలో ‘పుష్ప 3’(Pushpa 3) ఎప్పుడు రాబోతోంది? అనే ప్రశ్న ఉంది. ఈ ఉత్కంఠకు నిర్మాత రవిశంకర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. 2028లో ‘పుష్ప 3’ ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టంగా తెలిపారు. ఈ ఆసక్తికర అప్‌డేట్‌ను విజయవాడలో జరిగిన ‘రాబిన్ హుడ్’ మూవీ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. అయితే, కథ, తారాగణం, దర్శకుడిపై ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. పుష్ప 3 కోసం బ‌న్నీ ఫ్యాన్స్ 2028 వరకు వేచిచూడాల్సిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment