ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ఛాతి నొప్పితో ఆస్ప‌త్రిలో ఏఆర్ రెహ‌మాన్

ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆస్కార్ అవార్డు విన్న‌ర్ ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గుర‌య్యారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఉద‌యం చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిక ఏఆర్ రెహ‌మాన్‌కు డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి చికిత్స అందిస్తున్నారు. రెహ‌మాన్ ఆస్ప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిన ఫ్యాన్స్ అంతా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఏఆర్ రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. రెహ‌మాన్ ఆరోగ్యంపై మ‌రికాసేప‌ట్లో హెల్త్ బులిటెన్ విడుద‌ల కానున్న‌ట్లుగా తెలుస్తోంది. రెహమాన్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment