కోలీవుడ్ సూపర్ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహైండ్ ఉడ్స్(Behindwoods) అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన తన సినీ కెరీర్ గురించి చేసిన కామెంట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల సూపర్ హిట్‌గా నిలిచిన “మహారాజ” సినిమా(Maharaja)కు ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతిని బిహైండ్ ఉడ్స్ ఎంపిక చేసింది.
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. “ఈ సినిమా విజయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ‘మహారాజ’ విడుదలైన తర్వాత నా కెరీర్ పూర్తిగా మారిపోయింది. దీనికంటే ముందు మూడేళ్లపాటు నా సినిమాలు సరిగ్గా ఆడలేదు. నా కెరీర్ ముగిసిపోయిందని ఎంతోమంది చెప్పారు. కానీ ఈ సినిమా నాకు ఒక కొత్త జీవితం ఇచ్చింది, నా ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కల్పించింది” అని ఎమోషనల్(Emotional Speech)గా మాట్లాడారు.