రేవంత్ అడుగుపెట్టిన‌ చోట బీజేపీదే గెలుపు.. – KTR

రేవంత్ అడుగుపెట్టిన‌ చోట బీజేపీదే గెలుపు.. - KTR

Summarize with AI

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ భార‌తీయ జ‌న‌తా పార్టీదే గెలుపు అని, సొంత పార్టీ కాంగ్రెస్ ఆ ప్రాంతంలో భస్మమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలు తీసుకున్న మహబూబ్‌నగర్ (MBNR), మల్కాజ్‌గిరి లోక్‌సభ ఎన్నికలు, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటమిపాలై, బీజేపీ విజయం సాధించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇందులో ఏ మర్మం ఉందో రేవంత్‌కే తెలియాల‌ని అని చుర‌క‌లు అంటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment