‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక ఆసక్తికరమైన కథ

‘ప్యారడైజ్’లో నాని లుక్ వెనుక ఆసక్తికరమైన కథ

Summarize with AI

నేచురల్ స్టార్ నాని ‘ప్యారడైజ్’(Paradise Movie) టీజర్‌లో ఊరమాస్ లుక్‌తో కనిపించారు. నాని(Nani) లుక్ మాస్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ముక్కు పుక‌డ, ప్రత్యేకంగా నాని జడలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ప్యార‌డైజ్ సినిమాలో నాని లుక్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

నాని లుక్ వెనుక కథ ఏమిటి?
ఈ ఆసక్తికరమైన లుక్ వెనుక డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఆలోచన ఏమిటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. హీరో బాల్యం, అతని జీవిత పరిస్థితులను ప్రతిబింబించేలా రెండు జడలు డిజైన్ చేశామని చెప్పారు. చిన్నప్పుడు తనను తల్లి అలాగే జడలు వేసి పెంచిందని, అదే స్ఫూర్తిగా నాని లుక్ తీర్చిదిద్దామని వివరించారు. ప్యార‌డైజ్‌ సినిమా 2026 మార్చి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్ చూసిన అభిమానులు ఇప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment