రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతుల సంక్షేమం, పశు ఆరోగ్యం, పర్వత ప్రదేశాల అభివృద్ధి కోసం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
రోప్‌వే ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
విరాసిత్ భీ వికాస్ భీ పథకం కింద కేదార్‌నాథ్ రోప్‌వే ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ 4,081 కోట్ల రూపాయలతో ఆమోదం తెలిపింది. సోన్ ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ వరకు 12.9 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణం జరగనుంది. అదేవిధంగా హిమ కుండ్ సాహిబ్ రోప్‌వే నిర్మాణానికి 2,730 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
రైతులకు శుభవార్త..
రైతుల సంక్షేమం కోసం క్రిటికల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద 3,880 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఈ పథకం ద్వారా పశువులకు టీకాలు, తక్కువ ధరలకు మందులు, పశు ఔషధ కేంద్రాల ఏర్పాటు జరగనున్నాయి. వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ, పశు ఉత్పాదకత పెంపు, రైతుల ఆర్థిక నష్టాల నివారణ కోసం ఈ ప్రోగ్రామ్ కీలకంగా నిలవనుంది.