రోహిత్‌పై బాడీ షేమింగ్ చేయలేదు – శమా మహమ్మద్

రోహిత్‌పై బాడీ షేమింగ్ చేయలేదు – శమా మహమ్మద్

Summarize with AI

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై చేసిన కామెంట్ల‌పై కాంగ్రెస్ నాయకురాలు శమా మహమ్మద్(Shama Mohamed) స్పష్టత ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించార‌ని ఆమె స‌మ‌ర్థించుకున్నారు. “నేను చేసినది ఒక సాధారణ ట్వీట్ మాత్రమే. అది బాడీ షేమింగ్(Body Shaming) కాదని స్పష్టంగా చెప్పాలి. నేను ఎప్పుడూ క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి అనే అభిప్రాయంతో ఉంటాను. రోహిత్ కొంచెం బరువుగా ఉన్నట్లు అనిపించింది, అంతే కానీ నా మాటలను వక్రీకరించి వివాదం సృష్టించారు” అని ఆమె వివరణ ఇచ్చారు.

ట్వీట్ డిలీట్‌..
రోహితశర్మను విమ‌ర్శిస్తూ చేసిన పోస్టును కాంగ్రెస్ మహిళా నేత షామా మహ్మద్ డిలీట్ చేశారు. ‘రోహిత్‌కు ఫ్యాట్ ఎక్కువ. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యారు. క్రీడాకారుడిగా ఆయన పనికిరారు’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాత్రి నుంచి దుమారం రేపాయి. వీటిపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా మంత్రులు, నేతలు, హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌ ఫైర్ అవ్వడంతో ఆమె డిలీట్ చేయక తప్పలేదు. తాను అన్నదాంట్లో తప్పేం లేదని ఆమె వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డం కొస‌మెరుపు.

Join WhatsApp

Join Now

Leave a Comment