ప‌వ‌న్ కాన్వాయ్‌లో ప్ర‌మాదం.. వ్య‌క్తికి గాయాలు

ప‌వ‌న్ కాన్వాయ్‌లో ప్ర‌మాదం.. వ్య‌క్తికి గాయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. ప‌వ‌న్ కాన్వాయ్‌లోని వాహ‌నం ఢీకొని ఓ వ్య‌క్తం తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. డిప్యూటీ సీఎం కాన్వాయ్ ప్ర‌మాదానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మంగ‌ళ‌గిరి జ‌న‌సేన పార్టీ కార్యాల‌యం స‌మీపంలోని డీజీపీ ఆఫీస్ రోడ్డులో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌వ‌న్ కాన్వాయ్ ఢీకొని గాయ‌ప‌డిన వ్య‌క్తిని స‌మీపంలోని ఎన్ఆర్ఐ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వ్య‌క్తి రాధారంగా న‌గ‌ర్ నివాసితుడిగా గుర్తించారు. ప్ర‌స్తుతం క్ష‌త‌గాత్రుడి ఆరోగ్య ప‌రిస్థితి గురించి వివ‌రాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తున్న స‌మయంలో ట్రాఫిక్ క్లియ‌ర్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంపై జ‌న‌సేన పార్టీ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment