‘కన్నప్ప’ టీజర్.. ప్రభాస్ లుక్ హైలైట్

'కన్నప్ప' టీజర్.. ప్రభాస్ లుక్ హైలైట్

Summarize with AI

మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప'(Kannappa) సినిమా టీజర్ అద్భుతమైన విజువల్స్‌తో విడుదలైంది. టీజర్‌లో విష్ణు నటన, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇతర కీలక పాత్రల నటన ఆకట్టుకునేలా ఉన్నాయి.

అయితే, టీజర్ చివరిలో కనిపించిన ప్రభాస్(Prabhas) లుక్ అభిమానులను విశేషంగా ఆకర్షించింది. ఇప్పటికే విడుదలైన ‘శివ శివ శంకరా’ పాటకు మంచి స్పందన రావడంతో, ఈ టీజర్‌పై అంచనాలు మరింత పెరిగాయి. టీజర్ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, భక్తిరసాన్ని బలంగా చూపిస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్(Akshay Kumar), మోహ‌న్‌లాల్, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, శ‌ర‌త్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా, భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment