టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) కొత్త వివాదం(Controversy)లో చిక్కుకున్నారు. సంచలన దర్శకుడు జక్కన్నపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళితో తనకు దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందని, అతని టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటా అంటూ శ్రీనివాసరావు (Srinivasa Rao) విడుదల చేసిన సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ మారింది.
నా జీవితం నాశనం..
భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి(Rama Rajamouli) వల్ల తాను చనిపోతున్నానని, అందుకు సంబంధించి తాను ఇస్తున్న మరణ వాంగ్మూలం ఇది అని ఒక సెల్ఫీ వీడియో(Selfie Video)ను శ్రీనివాసరావు విడుదల చేశారు. తాను పబ్లిసిటీ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. రాజమౌళి వల్ల తన జీవితం నాశనమైందని ఆరోపించాడు. అన్ని కోల్పోయానని ఆరోపించారు. తాను, రాజమౌళిక ఒక ఒక అమ్మాయిని లవ్ చేశామని చెప్పారు.
అల్లరవ్వడం ఇష్టం లేక త్యాగం..
తమ ట్రయాంగిల్ లవ్ స్టొరీలో రాజమౌళి తనను త్యాగం చేయమని కోరాడని, కెరీర్ బిగినింగ్‌లో అల్లరవ్వడం కంటే త్యాగం గొప్పదని అనుకొని ఆ అమ్మాయిని వదులుకున్నాను. రాజమౌళి ఉన్నతస్థాయికి ఎదగాలని తాను అనేక త్యాగాలు చేశానని, చివరకు తనను పూర్తిగా అణిచివేడన్నారు. ఈ విషయాలన్నీ బయటకు ఎక్కడ చెబుతానోనని తనను టార్చర్ చేయడం మొదలు పెట్టాడని, రాజమౌళి టార్చర్ భరించలేక ఈ విషయాలు చెప్పి తాను చనిపోవాలని అనుకుంటున్నానన్నారు.
రాజమౌళి తాంత్రిక పూజలు..
ఇండస్ట్రీలో తిరుగులేని డైరెక్టర్‌గా ఎదుగడానికి రాజమౌళి తాంత్రిక పూజలు చేశాడని తన లేఖలో పేర్కొన్నాడు శ్రీనివాసరావు. ఆ తాంత్రిక పూజల వల్లే సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజమౌళిపై సుమోటో కేసు నమోదు చేయాలని శ్రీనివాసరావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. అయితే ఇప్పటివరకు రాజమౌళి ఈ ఆరోపణలపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. రాజమౌళికపై ఆయన స్నేహితుడు సంచలన ఆరోపణలు చేయడం టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.







