ఓటీటీలోకి ‘మద్రాస్ కారణ్’ తెలుగు వర్షన్

ఓటీటీలోకి 'మద్రాస్ కారణ్' తెలుగు వర్షన్

మెగా డాట‌ర్ నిహారిక (Niharika Konidela) కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మద్రాస్ కారణ్’ (MadrasKaaran) ఇప్పుడు తెలుగు వర్షన్‌తో ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తమిళంలో ఈ చిత్రం జనవరి 10న థియేటర్లలో విడుదలై, నెల తిరిగేలోపే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా, తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఆహా’ వేదికగా (Aha Streaming) ఫిబ్రవరి 26న స్ట్రీమింగ్‌కు రానుంది.

తక్కువ బడ్జెట్ – భారీ నష్టాలు
వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి. జగదీష్ నిర్మించారు. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్లు కూడా సాధించ‌కుండా భారీ నష్టాలను మూటగట్టుకుంది. తమిళ్‌లో ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా, అదే సమయంలో విశాల్ ‘మదగజరాజ’ మంచి టాక్ తెచ్చుకోవడంతో ‘మద్రాస్ కారణ్’కు ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోయింది. మ‌రి ఓటీటీలో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొంద‌గ‌ల‌దా.. అనేది వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment