టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ సూపర్ మ్యాన్‌లా చెలరేగిపోతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై తన అద్భుత ప్రదర్శన అభిమానులకు మరోసారి రుచిచూపించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 సెకండ్ మ్యాచ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన షమీ, మరో అరుదైన ఘనత సాధించారు.
అంతర్జాతీయ వన్డే (ODI) టోర్నీలలో ఐసీసీ ఈవెంట్లలో అత్యధిక వికెట్లు (60) తీసిన భారత బౌలర్ గా షమీ రికార్డు సృష్టించాడు. అతను కేవలం 19 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఫీట్ సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (32 ఇన్నింగ్స్‌లలో 59 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా, అశిష్ నెహ్రా లాంటి దిగ్గజ బౌలర్లు ఉన్నప్పటికీ, షమీ వేగంగా ఈ ఘనతను అందుకున్నాడు.
ఈ అద్భుత ప్రదర్శనతో భారత జట్టు మరింత బలంగా కనిపిస్తోంది. షమీ ఇలాంటి ఫామ్‌ను కొనసాగిస్తే, వచ్చే టోర్నమెంట్లలో మరిన్ని విజయాలు భారత బౌలింగ్ దళానికి అందుతాయని అభిమానులు భావిస్తున్నారు.