ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు ఇచ్చారు.
ప్రతిసారి జరిగే కుంభమేళాకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా హాజరవుతారు. సాధువులు, భక్తులు, ప్రముఖులు కుంభమేళాలో పాల్గొనడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఈ మహోత్సవంలో పాల్గొనడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది. పవన్ వెంట ఆయన కుమారుడు అకిరానందన్, దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.
హిందూ సంప్రదాయంలో కుంభమేళా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని భక్తుల విశ్వాసం.