ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మిలిటరీలోకి వారు నో ఎంట్రీ

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మిలిటరీలోకి వారు నో ఎంట్రీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ, కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను నిషేధించిన ట్రంప్, ఇప్పుడు సైన్యంలో కూడా వారికి అవకాశాలు లేకుండా చేశారు. అమెరికా ఆర్మీ ఈ నిర్ణయాన్ని ‘ఎక్స్’ (Twitter) వేదికగా ప్రకటించింది. ఈ నిబంధన వెంటనే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

ట్రాన్స్‌జెండర్లకు వ్యతిరేక నిర్ణయాలు
డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నప్పుడే ట్రాన్స్‌జెండర్ల నియామకాన్ని అడ్డుకునే నిర్ణ‌యం తీసుకున్నారు. కాగా, అప్పటికే సైన్యంలో పనిచేస్తున్న వారికి అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా మరోసారి లింగ మార్పిడి వ్యక్తులు మిలిటరీలో చేరడాన్ని పూర్తిగా నిషేధించేశారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం పాలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment