కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో భయానక ఘటన చోటుచేసుకుంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా టపాసులు పేల్చడం ఏనుగులకు కోపం తెప్పించింది. రెచ్చిపోయిన ఏనుగులు ఆలయ పరిసరాల్లో బీభత్సం సృష్టించాయి.
ఉత్సవం విషాదంగా మారిన క్షణం
టపాసులు పేల్చడంతో భయపడిపోయిన పీతాంబరం, గోకుల్ అనే రెండు ఏనుగులు ఒక్కసారిగా పరుగులు తీశాయి. ఈ అనూహ్య సంఘటన భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. 36 మంది గాయపడగా, వారిలో ఏడుగురి పరిస్థితి తీవ్రంగా ఉంది. పెద్ద పెద్ద శబ్దాలకు ఆగ్రహించిన ఏనుగులను కట్టడి చేయడానికి సుమారు రెండు గంటలు పట్టింది. ఈ ఘటన ఆలయ ఉత్సవాల్లో భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలు రేకెత్తించాయి.