రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేయ‌ర్స్ అండ్ ఆడియ‌న్స్ కోసం కూల్‌డింక్స్‌ విభాగంలోని స్పాన్సర్‌షిప్ హక్కులను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. ఈ డీల్ కోసం రిలయన్స్ దాదాపు రూ.200 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.

గతేడాది వరకు ఈ స్పాన్సర్ షిప్ హక్కులు కోకాకోలా(Coca-Cola) వద్ద ఉండగా, ఇప్పుడు వాటిని రిలయన్స్ (Reliance) స్వాధీనం చేసుకోవడంతో RCPL ఐకానిక్ డ్రింక్స్ బ్రాండ్ కంపాకోలా (Campa Cola)కి మరింత ప్రచారం లభించే అవకాశం ఉంది. IPL ద్వారా దేశవ్యాప్తంగా ఉత్పత్తిని విస్తరించే లక్ష్యంతో రిలయన్స్ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

IPL ప్రేక్షకుల్లో పానీయాల బ్రాండ్ల ప్రాచుర్యం ఎక్కువగా ఉండటంతో, ఈ స్పాన్సర్‌షిప్ రిలయన్స్ విక్రయాలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో మార్కెట్‌లో కోకాకోలా మరియు రిలయన్స్ మధ్య మరింత పోటీ పెరిగే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment