మంచు విష్ణు డ్రీమ్డ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) నుంచి తాజాగా రిలీజ్ అయిన డివోషనల్ సాంగ్ ఒకటి మ్యూజిక్ లవర్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది. మంచు విష్ణు(Manchu Vishnu) ‘కన్నప్ప’ సినిమా టీజర్, లుక్స్, VFXపై ట్రోలింగ్ జరుగుతున్న సమయంలో, తాజాగా విడుదలైన ‘శివశివ శంకర’ పాట (Shiva Shiva Shankara Song) మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
ఈ పాటకు విజువల్స్, లిరిక్స్ పై విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మంచు విష్ణు తన పాత్రలో జీవించారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఈ పాట మహాశివరాత్రి (Mahashivaratri Special Song) సందర్భంగా భక్తుల హృదయాలను కొల్లగొట్టేలా మారనుందని కామెంట్స్ చేస్తున్నారు.
‘కన్నప్ప’ ప్రాజెక్టులో తమిళ, తెలుగు, మలయాళ సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటులు భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రుద్రగా కనిపించనున్నారు. ప్రభాస్ రోల్‌కు సంబంధించిన పోస్టర్ విడుదలై, భారీ అంచనాలను నెలకొల్పింది.







