తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) కెరీర్‌లో చివరి సినిమాగా తెరకెక్కుతున్న ‘జన నాయగన్’ (Jana Nayagan)లో క్రేజీ హీరోయిన్ శృతిహాసన్(Shruti Haasan) కూడా జాయిన్ కానున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మేకర్స్ మరో హీరోయిన్‌గా శృతిని ఎంపిక చేసినట్లు సమాచారం.
త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననుండగా, ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమితా బైజు, బాబీ డియోల్, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రూ.300 కోట్ల భారీ బడ్జెడ్‌తో తెరకెక్కించనున్నట్లు సమాచారం.