రాజీనామా చేసిన అతిశీ.. ఎల్‌జీకి స‌మ‌ర్ప‌ణ‌

రాజీనామా చేసిన అతిశీ.. ఎల్‌జీకి స‌మ‌ర్ప‌ణ‌

ఢిల్లీ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఆతిశీ చేశారు. రాజ్ భవన్‌కు వెళ్లి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు తన రాజీనామా లేఖను అందించారు. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. కాగా, ఈ ఎన్నిక‌ల్లో సీఎం అతిశీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించ‌కుండా డ‌కౌట్ అయ్యింది.

ఎమ్మెల్యేగా ఆతిశీ విజ‌యం సాధించ‌గా, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, మాజీ మంత్రి స‌త్యేంద్ర జైన్ వంటి ఆప్ సీనియ‌ర్ నేత‌లు ఓట‌మి చ‌విచూశారు. ఢిల్లీ ఓట‌ర్ల బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఆప్ సీనియ‌ర్ ఓట‌మికి లిక్క‌ర్ స్కామ్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment