జ‌న‌సేన‌ ‘రాయ‌ల్‌’ అరాచ‌కాలు.. ఆడియో, వీడియోలు వైర‌ల్‌

జ‌న‌సేన‌ 'రాయ‌ల్‌' అరాచ‌కాలు.. ఆడియో, వీడియోలు వైర‌ల్‌

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్నిహితుడు, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గ జ‌నసేన పార్టీ ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ దారుణాలు ఆంధ్ర‌రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌హిళ‌ను డ‌బ్బు తీసుకొని మోసం చేయ‌డ‌మే కాకుండా, జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలికి ఫోన్ చేసి అస‌భ్య‌క‌రంగా మాట్లాడిన ఆడియోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ‘నేను మొగోడిని వంద మందితో తిరుగుతా‘ అంటూ రాయ‌లేని భాష‌లో బాధితురాలు ల‌క్ష్మిపై కిరణ్ రాయ‌ల్ నోరుపారేసుకున్నాడు. తిరుప‌తిలోనే కాదు.. రాష్ట్రంలో ఏ పోలీస్ స్టేష‌న్‌కు అయినా వెళ్లి నాపై కంప్ల‌యింట్ ఇచ్చుకో.. వెంట్రుక కూడా ఊడ‌దంటూ పోలీసు వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశారు.

కార్లు, ఖ‌రీదైన వ‌స్తువులు..
అధికార అండ‌తో జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా లీకైన ఆడియోల ద్వారా స్ప‌ష్టంగా అర్థం అవుతుంది. మ‌హిళ‌ల‌తో స‌న్నిహితంగా ఉన్న వీడియోలు ప్ర‌స్తుతం వాట్సాప్‌ల‌లో విప‌రీతంగా స‌ర్క్యూలేట్ అవుతున్నాయి. మ‌హిళ‌ల‌తో అక్ర‌మ సంబంధాలు కొన‌సాగిస్తూ, వారిని బెదిరించి డ‌బ్బులు లాక్కొని త‌రువాత ఆ మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తూ, వేధింపుల‌కు గురిచేస్తున్న కిర‌ణ్ రాయ‌ల్ బాగోతాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. మ‌హిళ‌ల‌ను లోబ‌ర్చుకొని వారితో కార్లు, ఖ‌రీదైన బంగారు వ‌స్తువులు కొనుగోలు చేయించుకుంటున్నాడ‌ని నిన్న‌టి నుంచి రిలీజ్ అవుతున్న వీడియోల్లో స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇచ్చిన డ‌బ్బు తిరిగి ఇవ్వ‌మంటే త‌న‌ను, త‌న పిల్ల‌ల‌ను చంపుతాన‌ని జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ బెదిరింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని బాధితురాలు ల‌క్ష్మి నిన్న సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

స్పందించ‌ని ప‌వ‌న్‌..
జ‌న‌సేన నేత కిర‌ణ్ తిరుప‌తిలో రాయ‌ల్‌గా అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నా.. అధికార పార్టీలు నోరుమెద‌ప‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌హిళా ర‌క్ష‌ణ‌పై అద్భుత‌మైన ప్ర‌సంగాలు చేసే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కిర‌ణ్ రాయ‌ల్ లీల‌ల‌పై ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నిస్తూ ప్ర‌తిప‌క్ష వైసీపీ చేసిన‌ ట్వీట్ సైతం వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనిపై జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్.. కిర‌ణ్ రాయ‌ల్‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులిస్తారా..? లేక మహిళ‌ల ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించినందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా..? అనేది వేచిచూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment