లైలా సెన్సార్ సర్టిఫికెట్‌పై విశ్వక్‌సేన్ రియాక్షన్

లైలా సెన్సార్ సర్టిఫికెట్‌పై విశ్వక్‌సేన్ రియాక్షన్

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్‌ విశ్వక్ సేన్ తన తాజా సినిమా ‘లైలా’ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు. సినిమా చూస్తే A సర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది అని విశ్వక్ స్పష్టం చేశాడు.

ఈ సినిమా స్టోరీపై విశ్వ‌క్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు రొటీన్ సినిమాలను ఒప్పుకోవడం లేదు. అందుకే విభిన్నమైన కథను ఎంచుకున్నామ‌ని చెప్పారు. డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నానని, కానీ లేడీ గెటప్ వేయడమే త‌నకు చాలా కష్టంగా అనిపించింది అని చెప్పారు. ‘లైలా’లో విశ్వక్ సేన్ తీసుకున్న ఛాలెంజింగ్ రోల్, అందులోని వినూత్నమైన కథాచరిత్రపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment