ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్టీవ్ స్మిత్ సంచలనం

ఆసీస్ కెప్టెన్సీకి నేను సిద్ధం.. స్టీవ్ స్మిత్ సంచలనం

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా జట్టును నడిపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోతే, తాను నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఎటువంటి అభ్యంతరం లేదని స్మిత్ స్పష్టం చేశాడు. అయితే, ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి, ఇప్పటికే స్టార్‌ పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌తో పాటు ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ కూడా గాయాల బారిన పడగా.. కెప్టెన్‌ కమిన్స్‌ కూడా చీలమండ నొప్పితో బాధపడుతున్నాడు. ఇవి జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ప్రారంభం కానుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment