విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో రౌడీషీటర్ హల్‌చల్ చేశాడు. తనను ఉద్యోగం నుంచి తీసేశారని పసిపిల్లల వార్డులోని ఆక్సిజన్ పైపును కట్ చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన కింగ్ జార్జ్ ఆస్పత్రిలో కలకలం సృష్టించింది. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేందుకు యత్నించిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పిల్లల వార్డులోకి ప్రవేశించిన రౌడీషీటర్ ఐసీయూకు వెళ్లే ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పైపులు కట్ చేసేందుకు యత్నించాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అని అరాచకాన్ని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రిలోని భద్రతా వైఫల్యాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.