గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, గాజా స్ట్రిప్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

పాలస్తీనియన్లు వేరే ప్రాంతాల్లో స్థిరపడిన తర్వాత గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. యుద్ధ సామగ్రిని కూడా అమెరికా స్వాధీనం చేసుకుని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.

మిడిల్ ఈస్ట్ పర్యటన ప్రస్తావన
ట్రంప్ భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటనలో గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను సందర్శించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. గాజా ప్రజలకు ఉద్యోగాలు, గృహాలు కల్పించేందుకు అమెరికా ప్రత్యేక ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment