అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత సంతతి అధికారి రోహిత్ చోప్రాపై షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో (CFPB) డైరెక్టర్గా బైడెన్ హయాంలో నియమితుడైన చోప్రాను ట్రంప్ పదవి నుంచి తొలగించారు.
చోప్రా హయాంలో డెమోక్రటిక్ ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే అనేక సంస్కరణలు అమలు చేసింది. ముఖ్యంగా, క్రెడిట్ రిపోర్టుల నుంచి వైద్య రుణాలను తొలగించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన పదవి ముగిసిన నేపథ్యంలో, రోహిత్ చోప్రా సోషల్ మీడియా ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ, తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, చోప్రాను ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) డెమోక్రటిక్ సభ్యుడిగా ఎంపిక చేశారు. అయితే, ట్రంప్ విధానాలకు అనుగుణంగా CFPB పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా, అనూహ్యంగా చోప్రాకు పదవీ విరమణ సందేశం పంపించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.