ఏపీలో వలంటీర్ల సేవలకు బ్రేక్ పడడంతో వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సామాజిక పింఛన్లను సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయిస్తున్నారు. కాగా, శ్రీ సత్యసాయి జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలోని ఆసరా పింఛన్ల కోసం వృద్ధులు ఒకచోట చేరి పడిగాపులు కాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత వైసీపీ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయించింది. ప్రతినెలా ఒకటో తేదీనే ఉదయం వలంటీర్లు లబ్ధిదారుల ఇంటంటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఏపీలో ప్రభుత్వం మారింది. వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు దూరమయ్యారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పెన్షన్లు అందించే తీరిక లేక అంతా ఒకేచోట ఉండాలని ఆదేశించడంతో వృద్ధులంతా మళ్లీ రోడ్ల మీదకు వచ్చారు. పెన్షన్లు అందించే అధికారి కోసం నిరీక్షిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఎం చంద్రబాబు మళ్లీ పాతరోజులు తీసుకొచ్చారని, ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ పోయి అంతా ఒక్కచోట గుమికూడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వృద్ధులు ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయించిన ఘనత వైఎస్ జగన్‌కే సొంతం అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.