‘అగత్యా’ మూవీ రిలీజ్‌ వాయిదా.. కారణం ఇదే!

‘అగత్యా’ మూవీ రిలీజ్‌ వాయిదా.. కారణం ఇదే!

Summarize with AI

జీవా మరియు యాక్ష‌న్ హీరో అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’ విడుదల వాయిదా పడింది. పా. విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, VFX (విజువల్ ఎఫెక్ట్స్) పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, విడుదల తేదీని ఫిబ్రవరి 28కి మారుస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఫాంటసీ, హారర్, థ్రిల్లర్ అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. జీవా-అర్జున్ సర్జా కాంబినేషన్, రాశీ ఖన్నా గ్లామర్, సాంకేతికతపై పెంచిన ఫోకస్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment