ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!

ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. లలిత్ వద్ద నుంచి గ్రెనేడ్, మావోయిస్టు కరప్రతాలు, రూ.10,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కదలికలు, స్థావరాల గురించి లలిత్‌ను తీవ్రంగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఎన్‌కౌంట‌ర్ చేస్తారా..?
లలిత్ అరెస్ట్‌ను పౌర హక్కుల సంఘం ఖండించింది. ఆయనను వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తోంది. అంతేగాక, గత ఘటనలను పరిగణనలోకి తీసుకుంటే, పోలీసుల విచారణ తర్వాత ఎన్‌కౌంటర్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది.

మావోయిస్టులపై ప్రభుత్వాల దృష్టి
గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై దృష్టిపెట్టాయి. ఛత్తీస్‌గఢ్, అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచి, చిన్న సమాచారం వచ్చినా తక్షణమే తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడే మావోయిస్టులను అరెస్ట్ చేయడం, కొన్ని సందర్భాల్లో ఎన్‌కౌంటర్ చేయడం జరుగుతోంది. ల‌లిత్‌ అరెస్ట్‌తో ఏపీ, తెలంగాణ సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల్లో కలకలం రేగింది. భవిష్యత్‌లో మరిన్ని కీలక అరెస్టులు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment