వైసీపీ నేత, మజీ ఎంపీ నందిగం సురేష్ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు(Mangalagiri Court) లో భారీ ఊరట లభించింది. మరియమ్మ హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నందిగం సురేష్‌కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా కేసు విచారణలో సహకరించాలని, పోలీసులు పిలిచినప్పుడు దర్యాప్తునకు హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. దాదాపు ఐదు నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నందిగం సురేష్, కోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి విడుదల కానున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నందిగం సురేష్‌పై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. తన భర్తపై చంద్రబాబు ప్రభుత్వం రకరకాల కేసులు బనాయించి జైల్లో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని నందిగం సురేష్ భర్య ఆరోపణలు చేసిన తెలిసిందే.