ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన బృందంతో దావోస్ (Davos) పర్యటనకు వెళ్లివచ్చారు. వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్‌లో పెట్టుబడుల వేట సాగిస్తామని వెళ్లి, ఒక్క ఎంవోయూ కూడా కుదుర్చుకోకుండా ఉత్తచేతులతో ఏపీకి తిరిగొచ్చారని చంద్రబాబు (CM Chandrababu) బృందంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు దావోస్ పర్యటనపై తాజాగా ఓ సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీవీ డిబేట్‌లో ఆ సీనియర్ జర్నలిస్ట్ మాటలు.. ఏడాది క్రితం కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ (Bandla Ganesh) అదే జర్నలిస్ట్ డిబేట్‌లో చెప్పిన మాటలు ఒకటే కావడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. బండ్ల గణేశ్ చెప్పిన కథను జర్నలిస్ట్ కాపీ కొట్టి చెప్పారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ (Video Viral)గా మారింది.
దావోస్‌లో హోటల్ వెంటిలేటర్ పగిలిపోయి (Glass Break Story) చలితో అధికారులెవరికీ ఆరోజు రాత్రి నిద్రపట్టలేదు. సీఎం చంద్రబాబును చూసి అధికారులు సిగ్గుతో తలదించుకున్నారు.. (అధికారులే తనతో చెప్పారని ఇటీవల టీవీ 5 డిబేట్‌లో మూర్తి కామెంట్స్) వీడియో..
చంద్రబాబు తన టీంతో దావోస్ కు వెళ్తే అక్కడ మైనస్ 10 డిగ్రీలు చలి ఉంది. వీళ్లు బస చేసిన హోటల్ లో అద్దం రాత్రి పగిలిపోయిందట. ఆ చలిలో చంద్రబాబు పరిస్థితి, ఆయన చెప్పిన సమాధానం విని నాకు కళ్ల నీళ్లు ఆగలేదు (ఏడాది క్రితం నవంబర్ 13, 2023న టీవీ 5 డిబేట్‌లో మూర్తికి బండ్ల గణేష్ చెప్పిన కథ) వీడియో..