---Advertisement---

సైఫ్ అలీఖాన్‌కు భారీ షాక్.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

సైఫ్ అలీఖాన్‌కు భారీ షాక్.. హైకోర్టు కీల‌క నిర్ణ‌యం
---Advertisement---

త‌న ఇంట్లోకి చొర‌బ‌డిన దొంగ చేతిలో తీవ్రంగా గాయ‌ప‌డి కొలుకొని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మధ్యప్రదేశ్ హైకోర్టు, పటౌడీ కుటుంబానికి చెందిన రూ. 15,000 కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి అనుమతిచ్చింది. ఈ నిర్ణయం ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం, పాకిస్తాన్ లేదా చైనాకు వలస వెళ్ళిన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు.

సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన భోపాల్‌లోని ఈ ఆస్తులపై సైఫ్, ఆయన తల్లి షర్మిలా టాగోర్, మరియు కుటుంబ సభ్యులు కోర్టులో వివాదం నడిపారు. గతంలో ఈ ఆస్తులపై స్టే ఆదేశాలు ఉన్నప్పటికీ, హైకోర్టు తాజాగా ఆ స్టేను ఎత్తివేసింది. ఈ ఆస్తులపై హైకోర్టు నిర్ణయం పటౌడీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment