ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ సోదాలు జోరుగా కొనసాగుతున్నాయి. సూపర్‌హిట్ మూవీ పుష్ప-2 భారీ కలెక్షన్ల నేపథ్యంలో సినిమా మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని సుకుమార్ ఇంట్లో విస్తృత తనిఖీలు జరుపుతూ పలు ఆర్థిక సంబంధిత వివరాలను పరిశీలిస్తున్నారు.
మరోవైపు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇల్లు మరియు కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్‌పై కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. పుష్ప-2 కలెక్షన్లు, నిధుల నిల్వ, ఫైనాన్షియల్ లావాదేవీలపై అనుమానాల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.
సినీ పరిశ్రమపై ఐటీ శాఖ దృష్టి
పుష్ప-2 వంటి భారీ బడ్జెట్ సినిమాల విజయాలు, కలెక్షన్లపై ప్రభుత్వ దృష్టి పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్థిక పారదర్శకతపై స్పష్టత కోసం ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో మరిన్ని వివరాలు వెలుగు చూడవచ్చని భావిస్తున్నారు.









ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్