ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న హాజరవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఫిబ్రవరి 10న వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేయనున్నారని సమాచారం. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 27న మహాకుంభమేళాను సందర్శించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలియజేశాయి. గడిచిన 9 రోజుల్లో 9 కోట్ల మంది ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం చేయడం విశేషమని అధికారులు వెల్లడించారు.
ప్రధాని, రాష్ట్రపతి, కేంద్రమంత్రుల పర్యటనలు సందర్భంగా కుంభమేళాలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. వీరి పర్యటన వల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.